Posts

Showing posts from September, 2022
Image
Participated in Two days National Seminar organised by Department of Telugu on 29.09.22
Image
' PRAJA SCIENCE VEDHIKA ' ACTIVITIES AND NEWS PAPAER CLIPS
Image
After dinner at Gurkha Restaurant. H.E.Ms Pooja Kapur, Ambassador, staff of Indian Embassy, Sofia Mr Subhash K Nayar, (HOC), Mr Hardesh Kumar Giri,Second Secreatry , Mr Manish Kumar, Mr Jain and Mr Ankit.
Image
  ఆఖరి మనుషుల బహిరంతర ఆవిష్కరణే "అవతలి గుడిసె" హిందీ మూలం నుంచి తెలుగులోకి   అనువాదమైన నవల # అవతలి _ గుడిసె హిందీలోని జయప్రకాష్ కర్థం 28 ఏళ్ల కిందట రాసిన నవలని తెలుగులోకి ప్రొ.వి కృష్ణ అనువాదం చేశారు.. కళ్యాణ్ రావు ఒక సందర్భంలో కవిత్వం గురించి రాస్తూ "మనతో సంభాషించేది మన ఒంట్లోని నెత్తుటి వాగుల్లో ఆటుపోట్లను సృష్టించేది కవిత్వమంటాడు"ఈ మాటలు కేవలం కవిత్వానికే కాకుండా నవల , కథ , వంటి ఏ సాహిత్య ప్రక్రియకైనా వర్తిస్తాయని అంటే అతిశయోక్తి కాదు... అవతలిగుడిసె ఆ విధంగా మనతో సంభాషించే నవల.లోని ఉద్రేకాల్ని పరుగులు పెట్టించే నవల.. ఈ నవల దళితుల జీవితాన్ని , పోరాటాన్ని , వారు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న పీడన , అణచివేత , దరిద్ర్యాన్నికళ్ళ ముందర బొమ్మ కట్టి చూపిస్తుంది. గంగా నది తీరాన ఉత్తరప్రదేశ్లోని మాతాపూర్ గ్రామం లో మొదలయ్యే ఈ నవల మొత్తంగా దేశంలోని దళిత జీవనాన్ని అందులోని ప్రతిఘటనను , ప్రేమను , వాళ్ల స్వేచ్ఛను గురించి ఇముడ్చుకుని మనతో సంభాషిస్తుంది సుక్ఖా , రమియా ఇద్దరు నిరుపేద దళిత దంపతులు వారికి ఒక్కగానొక్క కొడుకు చందన్. ఆ ఊరి భూస్వామి ఠాకుర్ హర్నా o సింగ్ విపరీత ఫ్యూ
Image
  మనిషిని పండించేవి పొలాలే వూషమల్ల కృష్ణ కేదార్‌నాథ్‌ సింగ్ కవితలు స్పష్టంగా , సరళంగా , సహజంగా మామూలు భాషలో ఉంటాయి , కవితలు ఎంత సహజంగా , సరళంగా ఉంటాయో అంతే లోతైన భావాలను వ్యక్తం చేస్తాయి. మనిషిని ఉన్నతీకరించడంతో బాటు ప్రపంచ సౌందర్యాన్ని మానవీయ కోణంతో ఆవిష్కరించిన మహా కవి ; మాటలనే కవితలుగా మలచిన మహా శిల్పి కేదార్‌నాథ్‌ సింగ్‌. ‘మాట్లాడుతాను , అందుకే రాస్తాను’ అని సగర్వంగా ఆయన ప్రకటించారు.   ఆధునిక హిందీ కవితా ప్రపంచంలోనే కాకుండా భారతీయ సాహిత్యంలోనూ తన కవితలతో ఒక ప్రత్యేకతను చాటిన మహాకవి కేదార్ నాథ్ సింగ్ ఇక లేరు. ఈ నెల 21 వ తేదీ ( సోమవారం) రాత్రి అనారోగ్యంతో ఆయన డిల్లీలో మరణించారు. 2013 సంవత్సరానికి గాను దేశంలోనే సర్వోన్నత సాహిత్య గౌరవం , అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భారతీయ జ్ఞానపీఠ్‌ అవార్డు’ను పొందిన ప్రశస్థ కవి కేదార్ నాథ్ సింగ్. హిందీ సాహిత్యంలో జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని పొందిన వారిలో కేదార్‌ నాథ్‌ పదవ వ్యక్తి.             ఈ మహాకవి ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో చకియా గ్రామంలో 1934 లో జులై ఒకటిన జన్మించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. , పిహెచ్. డి పట్టాలు పొందా
Image
  ముప్పుల్లో వర్సిటి అటానమీలు - వూషమల్ల కృష్ణ        కుల , మత , ప్రాంత భావాలు అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని చూపిస్తున్న నేటి సమాజంలో ఉన్నత విద్యకు సంబంధించిన కొత్త చట్టం మీద సమగ్ర చర్చ జరగ వలసిన అవసరం ఉంది. చర్చకు కేవలం పది రోజులు సరిపోవు. గడువు పొడిగించాలి. అన్ని కోణాలలో విశ్లేషించి శాస్త్రీయ ప్రణాళికలతో సమగ్ర చట్టాన్ని తీసుకురావాలి.           విశ్వ విద్యాలయాల నిధుల సంఘాన్ని (యునివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ యుజిసి) 1953 లో స్థాపించారు. ఉన్నత విద్యా వ్యవస్థలో ఎలాంటి ప్రభుత్వ జోక్యం గాని , రాజకీయ జోక్యం గాని ఉండకూడదనే సత్సంకల్పంతో అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ స్వయం ప్రతిపత్తితో కూడిన యుజిసి స్థాపనకు పూనుకున్నారు. ఆ రకంగా విశ్వవిద్యాలయాలు , ఇతర ఉన్నత విద్యా సంస్థల రోజు వారి వ్యవహారాలలో ప్రభుత్వ లేదా రాజకీయ జోక్యాన్ని నివారించే ప్రయత్నం చేశారు. నిజానికి మదన్ మోహన్ మాలవీయ లాంటి వారు కూడా విద్యా రంగాన్ని ప్రభుత్వ శాఖగా పరిగణించ కూడదని భావించారు. విశ్వ విద్యాలయాలలో రాజకీయ జోక్యాన్ని నివారించడం కోసం 1956 లో యుజిసి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 1956 నుంచి నేటి వరకు విశ్వ వి